ntr: కాస్టింగ్‌ కాల్‌.. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో కొన్ని పాత్రలకు కొత్తవారికి ఆహ్వానం

  • casting.ntrbiopic@gmail.com కి మీ వివరాలు పంపండి
  • రెండు ఫొటోలు, 30 సెకన్ల మీ నటన వీడియో సెండ్‌ చేయండి
  • 'ఎన్టీఆర్‌' సినిమాలో నటించే అవకాశం కొట్టేయండి

ఎన్‌బీకే ఫిల్మ్స్‌ నిర్మాణంలో నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మీకూ నటించాలని ఉందా? మీకు నటనలో ఆసక్తి ఉండి, మీ టాలెంట్‌ను ప్రదర్శించాలనుకుంటే casting.ntrbiopic@gmail.com కి మీ వివరాలు పంపండి.

"నటిస్తూ తెరమీద కనబడుతూ జీవించాలనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ మంచి అవకాశాలు రానివారు కొందరు.. అలాంటి వారికి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం" అంటూ ఆ సినిమా యూనిట్‌ ఓ ప్రకటన చేసింది. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ప్రాముఖ్యత గల కొన్ని పాత్రలకు కొత్తవారిని ఆహ్వానిస్తున్నామని, ఆసక్తి ఉన్న వారు రెండు ఫొటోలు పంపాలని, అలాగే స్మార్ట్‌ఫోన్‌లో తమ నటన ఏపాటిదో చూపెడుతూ 30 సెకన్లకు మించకుండా ఓ వీడియో తీసి తమకు మెయిల్‌ చేయాలని కోరింది.         

  • Loading...

More Telugu News