waqar younis: నెటిజన్ల చివాట్లు.. కేక్ కట్ చేసినందుకు క్షమాపణ చెప్పిన వకార్ యూనిస్!

  • వసీమ్ అక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్
  • అక్రం పక్కనే వకార్, రమీజ్ రాజా
  • రంజాన్ ఉపవాసాల సమయంలో ఇదేం పనంటూ నెటిజన్లు ఫైర్
పవిత్రమైన రంజాన్ మాసంలో కేక్ కట్ చేసి అందరి మనోభావాలను గాయపరిచినందుకు తనను క్షమించాలని పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం వకార్ యూనిస్ వేడుకున్నాడు. ఇంగ్లండ్,పాకిస్థాన్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ ఇస్తున్న వకార్... మరో క్రికెట్ దిగ్గజమైన వసీమ్ అక్రమ్ పుట్టినరోజు (3వ తేదీ) ను పురస్కరించుకుని కేక్ కట్ చేశాడు. ఈ సందర్భంగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా కూడా అక్కడే ఉన్నాడు.

ఈ ఫొటోను వకార్ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా... పలువురు విమర్శలు గుప్పించారు. రంజాన్ సందర్భంగా ఎందరో ఉపవాసాలు ఉంటే... మీరు కేక్ కట్ చేసి, ఎంజాయ్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. దీంతో, మరో ట్వీట్ ద్వారా వకార్ క్షమాపణలు కోరాడు. రంజాన్ పట్ల, ఉపవాసం ఉంటున్న వారి పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలని అన్నాడు. తాము చాలా తప్పు చేశామని తెలిపాడు.
waqar younis
rameez raja
wasim akram
birthday
cake cut

More Telugu News