mukesh ambani: ఆకాశ్ అంబానీ, శ్లోక మెహతా నిశ్చితార్థానికి ముహూర్తం రెడీ

  • ఈ నెల 30న ముంబైలో జరగనున్న కార్యక్రమం
  • ముకేశ్ అంబానీ స్వగృహం ఆంటిల్లాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు
  • వివాహం ఎప్పుడన్నది స్పష్టత వచ్చే అవకాశం
దేశంలోనే కుబేరుడైన వ్యాపార వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడి నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారైంది. ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ, శ్లోక మెహతాల నిశ్చితార్థ వేడుక ఈ నెల 30న జరగనుంది. ఇందుకు సంబంధించి ఆహ్వాన వీడియోను రూపొందించారు. ఈ వీడియోను వోగ్ ఇండియా తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ముకేశ్ అంబానీ స్వగృహం ఆంటిల్లాలో వేడుక జరగనుంది.

వీరి వివాహం ఈ ఏడాది చివర్లో జరగనుందన్న వార్తలు కూడా వచ్చాయి. డిసెంబర్ 8-10 మధ్య పెళ్లి ఉండొచ్చన్న సమాచారం బయటకు వచ్చింది. అయితే, కచ్చితంగా పెళ్లి ఎప్పుడన్న దానిపై ఇరు కుటుంబాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. నిశ్చితార్థంతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 25 ఏళ్ల ఆకాశ్ అంబానీ ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ గా ఉన్నారు. రిలయన్స్ జియో రూపకర్త. ఇక శ్లోకా మెహతా వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె.
mukesh ambani
akash ambani

More Telugu News