chittor: చెవిలో కాలీఫ్లవర్ పెట్టుకున్న ఎంపీ శివప్రసాద్!

  • ప్రజల చెవిలో పూలు పెడుతున్న కేంద్రం
  • జగన్, పవన్ లను ముందు పెట్టుకుని మోదీ కుట్ర
  • వినూత్నంగా నిరసన తెలిపిన శివప్రసాద్
నిత్యమూ తప్పుడు సమాచారాన్ని ఇస్తూ, కేంద్రం ఏపీ ప్రజల చెవుల్లో పూలు పెడుతోందని ఆరోపించిన చిత్తూరు ఎంపీ, నటుడు శివప్రసాద్, వినూత్నంగా తన చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, పవన్, జగన్ లను ముందు పెట్టుకుని నరేంద్ర మోదీ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

 వైసీపీ ఎంపీలు మాయ మాటలతో ప్రజలను మోసగిస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాలపై వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న మోదీ, అమిత్ షాలను ప్రజలు క్షమించబోరని చెబుతూ "ఆల్ పువ్వులూ ఆర్ స్పాన్సర్డ్ బై బీజేపీ" అంటూ వ్యంగ్యోక్తులు విసిరారు.
chittor
MP Sivaprasad
Califlower
Narendra Modi
Jagan
Pawan Kalyan

More Telugu News