vishal: 'అభిమన్యుడు'కి భారీ వసూళ్లు .. విశాల్ ఖాతాలో మరో హిట్!

  • విశాల్ హీరోగా వచ్చిన 'అభిమన్యుడు'
  • కథానాయికగా సమంత 
  • తమిళ .. తెలుగు భాషల్లో భారీ సక్సెస్  

విశాల్ హీరోగా ఆయన సొంత బ్యానర్లో రూపొందిన 'ఇరుంబు తిరై' ఇటీవలే తమిళంలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా తెలుగులో 'అభిమన్యుడు' పేరుతో ఈ నెల 1వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిజిటల్ ఇండియా నేపథ్యంలో ఒక సామాన్యుడు ఎదుర్కునే ఇబ్బందులే ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది.

మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 600 థియేటర్స్ లో విడుదల చేశారు. సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ ను చూసి వెంటనే మరో 60 థియేటర్లు పెంచారు. మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 7.10 కోట్లను వసూలు చేసింది. ఒక డబ్బింగ్ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం నిజంగా గొప్ప విషయమని అంటున్నారు. విశాల్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాల్లో అటు తమిళంలో ఇటు తెలుగులోనూ హిట్ కొట్టిన సినిమా ఇదేనని చెప్పొచ్చు. మొత్తానికి  హీరోగాను .. నిర్మాతగాను ఈ సినిమా విశాల్ కి విజయాన్ని .. లాభాలను తెచ్చిపెట్టింది.         

  • Loading...

More Telugu News