modi: ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన చైనా

  • ఇరు దేశాలు నమ్మకంతో కలసి పని చేస్తే.. ప్రపంచ భవిష్యత్తు కూడా బాగుంటుందన్న మోదీ
  • మోదీ వ్యాఖ్యల పట్ల సంతోషం వ్యక్తం చేసిన చైనా
  • ఇటీవలే జిన్ పింగ్ తో చర్చలు జరిపిన మోదీ

భారత్-చైనా సంబంధాల గురించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై చైనా హర్షం వ్యక్తం చేసింది. సింగపూర్ పర్యటన సందర్భంగా 'ఏషియాస్ ప్రీమియర్ డిఫెన్స్ అండ్ స్ట్రాటెజిక్ అఫైర్స్' కాన్ఫరెన్స్ లో మోదీ ప్రసంగిస్తూ, ఇండియా, చైనాలు ఒకరిపై మరొకరు నమ్మకంతో కలసి పని చేస్తే ఆసియాకే కాకుండా యావత్ ప్రపంచానికే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. సరిహద్దు సమస్యతో పాటు మరెన్నో విషయాల్లో ఇరుదేశాలు ఎంతో సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని చెప్పారు.

ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ ప్రతినిధి హువా చున్యింగ్ మాట్లాడుతూ, ఇండో-చైనా ద్వైపాక్షిక సంబంధాల గురించి మోదీ చేసిన వ్యాఖ్యలు ఆనందదాయకమని చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే ఇలాంటి స్పందనను తాము ప్రశంసిస్తున్నామని తెలిపారు. ఇటీవలే మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ల మధ్య జరిగిన భేటీని గుర్తు చేస్తూ... అంతర్జాతీయ అంశాలతో పాటు ద్వైపాక్షిక సంబంధాల గురించి ఇరువురు నేతలు చాలా లోతైన చర్చ జరిపారని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిణతితో తొలగించుకోవాలని నిర్ణయించారని తెలిపారు.

More Telugu News