rana: రానా త్రిభాషా చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్

  • అడవి నేపథ్యంలో రానా మూవీ 
  • తమిళ టైటిల్ గా 'కాదన్'
  • తెలుగు టైటిల్ గా 'అరణ్య'  

'బాహుబలి' తరువాత నుంచి రానా తన క్రేజ్ ను కాపాడుకుంటూ .. దానిని మరింత పెంచుకునే కథలను మాత్రమే అంగీకరిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన హిందీలో 'హాథీ మేరే సాథీ' సినిమా చేస్తున్నాడు. ఏనుగులతో హీరోకి గల స్నేహ సంబంధం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. అందువలన ఎక్కువభాగం షూటింగ్ అడవుల్లో జరుగుతోంది.

హిందీతో పాటు తమిళ .. తెలుగు భాషల్లోను ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తమిళంలో ఈ సినిమాకి 'కాదన్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా తెలుగులో ఈ సినిమాకి 'అరణ్య' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. దీపావళికి ఈ సినిమాను ఈ మూడు భాషల్లోను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఈ మూడు భాషల్లోను విజయాన్ని సాధిస్తుందనీ .. తనకి మరింత క్రేజ్ ను తీసుకొస్తుందని రానా భావిస్తున్నాడు.   

More Telugu News