karthi: 'నువ్ రైతువైతే కాలర్ ఎగరేసుకుని తిరుగంతే' .. 'చినబాబు'గా అదరగొట్టేస్తోన్న కార్తీ

  • పాండిరాజ్ దర్శకత్వంలో 'చినబాబు' 
  • రైతు వేషధారణలో కార్తీ 
  • తెలుగు .. తమిళ భాషల్లో విడుదల

కార్తీ హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో తమిళంలో 'కడైకుట్టి సింగం' చిత్రం రూపొందింది. సాయేషా సైగల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాకి 'చినబాబు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. పంటలు .. పచ్చదనం .. ప్రేమలు .. ఆప్యాయతలతో కూడిన గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిందనే విషయం ఈ టీజర్ వలన అర్థమవుతోంది.ఆ ఊరికి పెద్దదిక్కుగా సత్యరాజ్ .. ఆయన చిన్న కొడుకుగా కార్తీ కనిపిస్తున్నారు. రైతు వేషధారణ లో కనిపిస్తూ కార్తీ ఆకట్టుకుంటున్నాడు. ' పుట్టించేవాడు దేవుడైతే .. పండించేవాడూ దేవుడే' .. 'నువ్ రైతువైతే కాలర్ ఎగరేసుకు తిరుగు అంతే' అంటూ కార్తీ చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథాంశంతో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

  • Loading...

More Telugu News