junior ntr: ఎన్టీఆర్ కు కూతురు పుట్టిందనే వార్త... పూర్తిగా ఫేక్!

  • జూనియర్ ఎన్టీఆర్ కు అమ్మాయి పుట్టిందంటూ ప్రచారం
  • సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ
  • ఇది ఫేక్ న్యూస్ అని చెప్పిన పీఆర్ఓ మహేష్
జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు కుమార్తె పుట్టిందనే వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి 10.20 గంటల సమయంలో పండంటి పాపకు లక్ష్మీప్రణతి జన్మనిచ్చినట్టు వార్తలు వెల్లువెత్తాయి. అయితే, ఈ వార్త పూర్తిగా అబద్ధమని తేలిపోయింది. ఈ వార్త నిజమేనా? అంటూ పీఆర్ఓ మహేష్ కోనేరును ఓ నెటిజన్ ప్రశ్నించాడు.

ఆ వార్తలో నిజం లేదని... అదంతా ఫేక్ న్యూస్ అని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో, జూనియర్ ఎన్టీఆర్ కు కుమార్తె పుట్టిందనే వార్తలో నిజం లేదని తేలిపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఏది నిజమో? ఏది అబద్ధమో? అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నామని చెప్పేందుకు ఇదో ఉదాహరణ.
junior ntr
daughter
fake news
tollywood

More Telugu News