Anantapur District: భార్య వివాహేతర బంధాన్ని బట్టబయలు చేసేందుకు సొంత పడకగదిలో సీసీ కెమెరాలు!

  • అనంతపురంలో ఘటన
  • తన సహాయకుడి భార్యతో మత ప్రబోధకుడి సంబంధం
  • సీసీ కెమెరాల ఏర్పాటుతో గుట్టు రట్టు
  • కేసు నమోదు చేసిన పోలీసులు
తన భార్యకు ఓ మత ప్రబోధకుడితో వివాహేతర సంబందం ఉందని అనుమానించిన అతని సహాయకుడు, సొంత బెడ్ రూములో సీసీ కెమెరాలు అమర్చి, వారి బాగోతాన్ని బట్టబయలు చేసి, పోలీసులను ఆశ్రయించిన ఘటన అనంతపురంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ ప్రార్థనా మందిరంలో పనిచేస్తున్న వ్యక్తి, పైకి నలుగురికీ సేవాగుణాన్ని, మానవత్వం గురించి బోధిస్తూ, తన వద్ద సహాయకుడిగా పనిచేసే వ్యక్తి భార్యపై కన్నేశాడు. పట్టణ పరిధిలోని రాంనగర్ లో ప్రబోధకుడు, శ్రీనగర్ కాలనీలో సహాయకుడు ఉండేవారు. కలసి ఒకే చోట పనిచేస్తుండటంతో రెండు కుటుంబాలూ తరచూ కలుస్తుండేవి.

 ఈ క్రమంలో ప్రబోధకుడు, సహాయకుడి భార్య మధ్య పరిచయం వివాహేతర బంధంగా మారింది. అతను తరచూ తన ఇంటికి వస్తుండటంతో, ఏదో జరుగుతోందని అనుమానించిన సహాయకుడు, తన ఇంటి పడకగదిలో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టాడు. ఈ విషయం తెలియని ప్రబోధకుడు ఎప్పటిలానే వచ్చి, రాసలీలలు సాగించి వెళ్లాడు. ఈ దృశ్యాలనే సాక్ష్యంగా చూపిస్తూ, నాలుగో పట్టణ పోలీసులను బాధితుడు ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.
Anantapur District
Extra Marital Affair
CC Cameras
Police

More Telugu News