kaala: ‘కాలా’ చిత్రం విడుదల బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది: ప్రకాష్ రాజ్

  • సినిమా విడుదల ఆపాలని కర్ణాటక ఫిల్మ్ చాంబర్ కోరలేదు
  • డిస్ట్రిబ్యూటర్లు, ప్రదర్శన దారులే ఆ నిర్ణయం తీసుకున్నారు
  • సినిమా ప్రశాంతంగా విడుదల అయ్యేలా చూసే బాధ్యత ప్రభుత్వాలదే
రజనీకాంత్ నటించిన కాలా చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కాకుండా ఆ రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ నిషేధించలేదని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. డిస్ట్రిబ్యూటర్లు, ప్రదర్శనదారులు వారంతట వారే ఆందోళనలకు తావు లేకుండా ఉండేందుకు విడుదల చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై ఏఎన్ఐ వార్తా సంస్థతో ఈ రోజు ఆయన మాట్లాడారు.

 సినిమా ప్రశాంతంగా విడుదల అయ్యేలా చూసే బాధ్యత ఇప్పుడిక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. కావేరీ నదీ జల వివాదంపై రజనీకాంత్ లోగడ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కర్ణాటక రాష్ట్రంలోని పలు వర్గాలు కాలా సినిమా విడుదలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక ఫిల్మ్ చాంబర్ కాలా చిత్రం విడుదల చేయరాదని గత మంగళవారం నిర్ణయించినట్టు వార్తలు రాగా, తాజాగా ప్రకాష్ రాజ్ దీనిపై స్పష్టత ఇచ్చారు. చిత్రం విడుదలను నిలిపివేయాలని ఏ ఒక్కరినీ ఫిల్మ్ చాంబర్ కోరలేదని తెలిపారు.

kaala
rajnikanth
prakash raaj

More Telugu News