India: చీర కట్టులో హీరోయిన్ అదా శర్మ ఫిట్ నెస్ వీడియో!

  • 'హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్' చాలెంజ్
  • ముద్గల్ తో కసరత్తులు చేసిన అదా శర్మ
  • చీరలో వర్కవుట్స్ పై హక్కులు నావేనంటూ చమత్కారం
ఇండియాలో ఇటీవల మొదలైన 'హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్' చాలెంజ్ పై హీరోయిన్ అదా శర్మ వినూత్నంగా స్పందించింది. చీర కట్టుకుని తనలోని ఫిట్ నెస్ ను, యోగా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, వీడియో తీసి అభిమానులతో పంచుకున్న అదా శర్మ, ఇతర హీరోయిన్లు తనలా చీర కట్టుకుని చేయద్దని సలహా ఇచ్చింది.

తాను ఇండియన్ ను కాబట్టి, భారత మహిళలా చీర కట్టుకుని ఎక్సర్ సైజ్ చేశానని, చీర కట్టుకుని వర్కవుట్స్ చేయాలన్న ఆలోచనపై సర్వహక్కులూ తనవేనని చమత్కరించింది. ఈ విషయంలో ఇతర హీరోయిన్లు తనను కాపీ కొట్టవద్దని చెప్పింది. ఇక ఈ వీడియోలో అదా శర్మ ముద్గల్ (కర్రలు) వాడుతూ కసరత్తులు చేసింది. ముద్గల్ వాడకాన్ని తాను మహారాష్ట్రలోని ఓ అఖాడాలో చూశానని, ఈ కసరత్తుల వల్ల కండరాలు బలంగా మారుతాయని చెప్పింది. దేహాన్ని ఫిట్ గా ఉంచుకోవడం అంటే, మనసును అదుపులో పెట్టుకోవడమేనని చెప్పింది. అదా శర్మ పోస్టు చేసిన వీడియో నెట్టింట వైరల్ కాగా, లక్షల మంది వీక్షించారు. వీడియోను మీరూ చూడవచ్చు. 
India
Ada Sharma
Fitness Challenge
Viral Videos

More Telugu News