Petrol: వరుసగా ఆరో రోజూ తగ్గిన పెట్రోలు ధర... తాజా ధరల వివరాలు!

  • 15 పైసలు తగ్గిన పెట్రోలు ధర
  • 14 పైసలు తగ్గినా డీజెల్ ధర
  • హైదరాబాద్ లో లీటరు పెట్రోలు రూ. 82.59

కర్ణాటక ఎన్నికలు ముగిసిన తరువాత ఆల్ టైమ్ రికార్డుకు చేరిన 'పెట్రో' ఉత్పత్తుల ధరలు, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో తగ్గుముఖం పట్టాయి. నేడు వరుసగా ఆరో రోజూ పెట్రోలు ధర తగ్గింది. పెట్రోలు ధరను 15 పైసలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.  నిన్న డీజెల్ ధరను సవరించని ఓఎంసీలు, నేడు మాత్రం డీజెల్ ధరను 14 పైసల మేరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి.

తాజా ధరల వివరాలు పరిశీలిస్తే, పెట్రోలు ధర లీటరుకు ఢిల్లీలో రూ. 77.96, కోల్ కతాలో రూ. 80.60, ముంబైలో రూ. 85.77, చెన్నైలో రూ. 80.94గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 82.59గా ఉంది. ఇదే సమయంలో డీజెల్ ధర ఢిల్లీలో రూ. 68.97, కోల్ కతాలో రూ. 71.52, ముంబైలో రూ. 73.43, చెన్నైలో రూ. 72.82గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 74.97గా ఉంది.

More Telugu News