chennupati srinu: ఏ పార్టీలో చేరుతానో రెండు రోజుల్లో చెబుతా: వంగవీటి రంగా బావమరిది చెన్నుపాటి శ్రీను

  • రంగా, రాధాల ఆశయ సాధన కోసం పాటుబడే పార్టీలో చేరుతా
  • అందరికీ అందుబాటులో ఉంటా
  • రంగా, రాధా మిత్ర మండలి అభిప్రాయం మేరకే నా నిర్ణయం
తన రాజకీయ భవితవ్యంపై వంగవీటి మోహన రంగా బావమరిది చెన్నుపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు. ఏ పార్టీలో చేరబోతున్నాననే విషయాన్ని మరో రెండు రోజుల్లో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. రంగా, రాధాల ఆశయ సాధన కోసం ఏ పార్టీ అయితే పాటుబడుతుందో... ఆ పార్టీకి చేరువవుతానని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా రంగా, రాధా మిత్రమండలి అభిప్రాయం మేరకే తీసుకుంటానని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన రంగా, రాధా మిత్రమండలి సమావేశానికి రెండు వేలకు పైగా సభ్యులు హాజరయ్యారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలి సభ్యులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రంగా, రాధాలు ఎంతో కృషి చేశారని కొనియాడారు. మరోవైపు, టీడీపీలో చేరాలని చెన్నుపాటి శ్రీను దాదాపు తుది నిర్ణయానికి వచ్చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. మండలి సమావేశానికి పలువురు టీడీపీ కార్పొరేటర్లతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 
chennupati srinu
vangaveeti
ranga
radha

More Telugu News