Rains: తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడే అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరిక!

  • నాలుగు రోజుల పాటు వర్షాలకు చాన్స్
  • ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 7వ తేదీ వరకూ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నామని, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో పిడుగులు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలియజేసింది.

 ఇదే సమయంలో రుతుపవనాలు కేరళను దాటి దక్షిణ రాయలసీమ, పశ్చిమ తమిళనాడు ప్రాంతాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, పిడుగులు పడే అవకాశాలు కూడా వున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాగా, గడచిన రెండు రోజుల్లో కోస్తాంధ్ర మినహా ఏపీలోని మిగతా జిల్లాలు, తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గుముఖం పట్టాయి.

  • Loading...

More Telugu News