USA: అమెరికాలో నీట మునిగి తెలుగు యువకుడు తోట అనూప్ దుర్మరణం!

  • బ్లూమింగ్ టౌన్ లో ఘటన
  • మాన్రో సరస్సులో ఈతకు దిగిన అనూప్
  • శోక సంద్రంలో స్నేహితులు,తల్లిదండ్రులు
అమెరికాలోని ఇండియానా స్టేట్ బ్లూమింగ్ టౌన్ లో తెలుగు యువకుడు తోట అనూప్ దుర్మరణం చెందాడు. బ్లూమింగ్ టౌన్ లోని మాన్రో సరస్సు వద్దకు తన స్నేహితులతో కలసి బోటింగ్ కు వెళ్లిన అనూప్, నీటిలో గల్లంతు కాగా, ఆపై అతని మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు.

బోటింగ్ తరువాత అనూప్ సరస్సులో ఈతకు దిగాడని అతని స్నేహితులు తెలిపారు. అనూప్ గల్లంతుకాగానే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు హుటాహుటిన వచ్చి సహాయక చర్యలు చేపట్టినా, అనూప్ ప్రాణాలను కాపాడలేకపోయారని తెలుస్తోంది. అనూప్ మృతి అతని స్నేహితుల్లో తీవ్ర ఆవేదనను నింపగా, వార్త తెలిసిన తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
USA
Blooming Town
Totha Anup
Swmming
Boating

More Telugu News