Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ పర్యటన అంతా టీడీపీపై విమర్శలు చేయడానికే!: ఏపీ మంత్రి కళా వెంకట్రావు

  • వేరే అంశాలు లేవు
  • ఉద్ధానంలో ఎన్ని డయాలసిస్‌ కేంద్రాలు ఉన్నాయో తెలుసా?
  • బీజేపీ, వైసీపీలను పవన్‌ విమర్శించట్లేదు
  • వైసీపీ ఎంపీల రాజీనామాలు ఓ డ్రామా

వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. జన పోరాట యాత్ర పేరుతో పవన్‌ చేస్తోన్న పర్యటన అంతా టీడీపీపై విమర్శలు చేయడానికే అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఆయన పర్యటనలో వేరే అంశాలు ఏమీ లేవని అన్నారు.

ఉద్ధానం, శ్రీకాకుళంలో ఎన్ని డయాలసిస్‌ కేంద్రాలు ఉన్నాయన్న విషయంపై ఆయనకు అవగాహన ఉందా? అని కళా వెంకట్రావు ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీలను పవన్‌ కల్యాణ్‌ విమర్శించట్లేదని అన్నారు. కాగా, జగన్మోహన్‌ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వైసీపీ ఎంపీల రాజీనామాలు ఓ డ్రామా అని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News