Amitabh Bachchan: ఈ ఉత్పత్తులకు నేను ప్రచారకర్తగా ఉండను: అమితాబ్ బచ్చన్

  • మద్యం, పొగాకు ఉత్పత్తులకు ప్రచారం చేయను
  • నాకు నచ్చిన ఉత్పత్తులకే బ్రాండ్ అంబాసడర్ గా ఉంటా
  • 'సైరా' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బిగ్ బీ
తాను ఏ ఉత్పత్తులనైతే వాడతానో, వాటికే ప్రచారం చేస్తానని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. మద్యం, పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులకు తాను ఎట్టి పరిస్థితుల్లో బ్రాండ్ అంబాసడర్ గా ఉండనని చెప్పారు. తనకు ఏదైనా ఉత్పత్తి నచ్చి, దాన్ని తాను కూడా వాడగలననే నమ్మకం ఏర్పడితేనే ప్రచారకర్తగా వ్యవహరిస్తానని తెలిపారు.

తాను మద్యం, పొగాకుకు దూరంగా ఉంటానని... అందుకే, వాటికి ప్రచారం చేయబోనని చెప్పారు. క్యూరియస్ క్రియేటివ్ అవార్డును అందుకున్న సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ, ఈ మేరకు స్పందించారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ మూడు సినిమాల్లో నటిస్తున్నారు. చిరంజీవి 'సైరా' చిత్రంలో కూడా ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.
Amitabh Bachchan
bollywood
brand ambassador

More Telugu News