అట్టుడుకుతున్న కశ్మీర్... మూడు గ్రనేడ్ దాడులు, సరిహద్దుల వద్ద ఫైరింగ్ లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి!
- సీఆర్పీఎఫ్ వాహనం ఢీకొని నిరసనకారుడు మృతి
- నిరసనలు, ధర్నాలకు దిగిన యువత
- గ్రనేడ్ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు
- కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
యువకుడి మృతికి సైనికులే కారణమంటూ, పెద్దఎత్తున యువత ధర్నాలకు దిగుతుండటం, శ్రీనగర్ ప్రాంతంలో మళ్లీ అల్లర్లు చెలరేగుతుండటంతో, పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు లోయలో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ఇదిలావుండగా, రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణకు కట్టుబడి వుందామని సలహాలు ఇచ్చిన పాక్, సరిహద్దుల్లో భారత జవాన్లు లక్ష్యంగా కాల్పులు జరిపింది. అక్నూరు సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మరణించారు. ఎటువంటి కవ్వింపు చర్యలూ లేకుండానే పాక్ కాల్పులకు తెగబడిందని సైన్యాధికారి ఒకరు ఆరోపించారు.