Chandrababu: నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, భార్యలను వదిలేసిన వారికి ఓట్లు పడవు: యరపతినేని సెటైర్

  • 16 నెలలు జైల్లో ఉండి వచ్చినంత మాత్రాన ఓట్లు పడవు
  • చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉంది
  • సీనియర్ అయిన చంద్రబాబును మోదీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ లపై గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకుని భార్యలను వదిలేస్తేనో, 16 నెలలు జైల్లో ఉండి వస్తేనో ఓట్లు పడవని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉండటం సహజమేనని... అయితే, అన్నిటికన్నా ముఖ్యంగా వారికి క్యారెక్టర్ ఉండాలని చెప్పారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తికే ఓట్లు పడతాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబును జనసేన, వైసీపీ నేతలు విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. పిడుగురాళ్లలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం అలుపెరుగకుండా చంద్రబాబు కష్టపడుతున్నారని, ఎన్నికల్లో అన్ని సీట్లను గెలిపించి ఆయనకు కానుకగా ఇవ్వాలని యరపతినేని కోరారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబే సీనియర్ అని... అందుకే ఆయనను ఇబ్బందులకు గురి చేసేందుకు జగన్ ను ప్రధాని మోదీ దగ్గరకు తీసుకున్నారని మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటిని తాను సందర్శిస్తానని, అందరి కష్టనష్టాలను తెలుసుకుని వాటిని తీర్చేందుకు యత్నిస్తానని చెప్పారు. 

More Telugu News