suicide: ఇకపై ఆత్మహత్యకు యత్నించడం నేరం కాదు.. చట్టంలో మార్పులు చేసిన కేంద్రం

  • క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని 309 సెక్షన్ తొలగింపు
  • ఆత్మహత్యాయత్నం చేసిన వారికి అండగా ప్రభుత్వం
  • చిన్నపిల్లలకు విద్యుత్ షాక్ ద్వారా చికిత్స నిషేధం 

వివిధ కారణాల వల్ల ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఎంతో బాధ కలిగించే విషయం. చట్ట ప్రకారం ఆత్మహత్యాయత్నం చేయడం కూడా నేరమే. అయితే, ఇకపై ఆత్మహత్యకు యత్నించడాన్ని నేరంగా పరిగణించరు. 'నూతన మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం 2017' ప్రకారం ఇకపై మన దేశంలో ఆత్మహత్యాయత్నం నేరం కాదు.

ఏడాది క్రితం ఆమోదించిన బిల్లును కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత నెల 29వ తేదీన నోటిఫై చేసింది. ఆత్మహత్యను నేరంగా పరిగణించవద్దని ఆదేశించింది. దీనికి సంబంధించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని 309 సెక్షన్ ను తొలగిస్తూ, చట్టంలో మార్పులు చేసింది. మారిన చట్టం ప్రకారం ఆత్మహత్యాయత్నం చేసిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారికి ప్రభుత్వం తరపున ఉచితంగా వైద్య చికిత్స అందించడంతో పాటు పునరావాసం కూడా కల్పించనుంది. అంతేకాదు, మానసిక వైకల్యంతో బాధ పడుతున్న చిన్న పిల్లలకు విద్యుత్ షాక్ ద్వారా చికిత్సను అందించడాన్ని కూడా నిషేధించింది.

  • Loading...

More Telugu News