amaravathi: అమరావతిలో హైకోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర పర్యావరణ, అటవీశాఖలు

  • హైకోర్టు, హెచ్ఓడీ స్టాఫ్ హౌసింగ్ ప్రాజెక్టులకు ఆమోదం
  • వెల్లడించిన సీఆర్డీయే అధికారులు
  • నెరవేరబోతున్న ఆంధ్ర ప్రజల కోరిక

ఏపీ ప్రజల మరో కల నిజం కానుంది. రాజధాని అమరావతిలో హైకోర్టు, హెచ్ఓడీ స్టాఫ్ హౌసింగ్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లభించాయి. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సీఆర్డీయే అధికారులు తెలిపారు. రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనాల అథారిటీతో కలిసి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్టు చెప్పారు. మరోవైపు, హైకోర్టును రెండుగా విభజించాలంటూ తెలంగాణ నుంచి కూడా తీవ్ర ఒత్తిడి వస్తున్న విషయం తెలిసిందే. హైకోర్టు రెండుగా విడిపోతేనే తమకు న్యాయం జరుగుతుందని తెలంగాణవాదులు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రజల కల కూడా తీరబోతోంది. 

More Telugu News