vijay: హీరో విజయ్ పుట్టినరోజున ప్లాన్ చేసిన మురుగదాస్

  • మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ 
  • కథానాయికగా కీర్తి సురేశ్ 
  • తమిళ .. తెలుగు భాషల్లో దీపావళికి విడుదల  

తమిళనాట మాస్ ఆడియన్స్ లో విజయ్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన తాజా చిత్రం మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయలేదు .. ఫస్టులుక్ వదల్లేదు.ఈ నెల 22వ తేదీన విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ రోజున టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను రిలీజ్ చేయాలని మురుగదాస్ భావిస్తున్నాడట. ప్రస్తుతం ఆయన అదే పనిలో వున్నాడని అంటున్నారు. గతంలో విజయ్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన 'కత్తి' .. 'తుపాకి' ఘన విజయాలను సాధించాయి. అందువలన ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడుతుందనే నమ్మకంతో అభిమానులు వున్నారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.         

  • Loading...

More Telugu News