vishal: 'అభిమన్యుడు' మంచి మార్కులు కొట్టేశాడు

  • తమిళంలో హిట్ కొట్టిన 'ఇరుంబు తిరై'
  • తెలుగులో 'అభిమన్యుడు'గాను సక్సెస్ 
  • కథాకథనాల్లోని కొత్తదనమే కారణం

విశాల్ కథానాయకుడిగా తమిళంలో చేసిన 'ఇరుంబు తిరై' అక్కడ ఘన విజయాన్ని సాధించింది. సమంత కథానాయికగా చేసిన ఈ సినిమాను 'అభిమన్యుడు' పేరుతో నిన్న తెలుగునాట భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. తమిళంలో మాదిరిగానే ఈ సినిమా ఇక్కడ సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. కంటెంట్ కొత్తగా ఉండటం .. అది టెక్నాలజీకి సంబంధించింది కావడంతో పాటు సమంత గ్లామర్ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ గా నిలిచిందని అంటున్నారు.

ఈ కారణంగానే ఇక్కడి యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఈ సినిమా బాగా ఆకట్టుకుందని చెబుతున్నారు. ఇక ఇదే రోజున నాగ్ 'ఆఫీసర్ ' ..  రాజ్ తరుణ్ 'రాజుగాడు ' ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కాంబినేషన్ పై గల అంచనాలను 'ఆఫీసర్' ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయింది. ఇక 'రాజుగాడు' కూడా అంతగా మెప్పించలేకపోయాడు. ఈ కారణంగానే 'అభిమన్యుడు'కి మరిన్ని మార్కులు పడిపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.      

  • Loading...

More Telugu News