Narendra Modi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

  • ఏపీ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి
  • తెలంగాణ ప్రజల కలలన్నీ నెరవేరాలి
  • రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ ట్వీట్
తెలుగు రాష్ట్రాలు ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏపీ, తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. "ఆంధ్రప్రదేశ్ సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. రానున్న కాలంలో తెలంగాణ ప్రజల కలలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా" అంటూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంచితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మరోవైపు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.
Narendra Modi
Andhra Pradesh
Telangana
tweet
formation day

More Telugu News