bcci: ఫెమా నిబంధనల ఉల్లంఘన.. బీసీసీఐకి ఈడీ భారీ వడ్డన!

  • 2009లో దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ ను నిర్వహించిన బీసీసీఐ
  • రూ. 243 కోట్లు సౌతాఫ్రికాకు తరలింపు
  • ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఈడీ

భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. భారీ జరిమానాను విధించింది. 2009 ఐపీఎల్ కు సంబంధించి బీసీసీఐతో పాటు అప్పటి సభ్యులకు రూ. 121 కోట్ల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది. 2009లో ఐపీఎల్ ను దక్షిణాఫ్రికాలో నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ, విదేశీ ఖాతాను తెరవకుండానే, రూ. 243 కోట్లను టోర్నీ నిర్వహణ కోసం దక్షిణాఫికాకు బీసీసీఐ తరలించింది. ఇది ఫెమా చట్టాన్ని ఉల్లంఘించడం కిందకు వస్తుంది. ఈ నేపథ్యంలో, దర్యాప్తు చేపట్టిన ఈడీ... బీసీసీఐ ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందనే నిర్ధారణకు వచ్చింది. దీంతో, భారీ జరిమానా విధించింది. 

More Telugu News