indrani mukherjea: ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఇంద్రాణి ముఖర్జియా

  • షీనా బోరా హత్య కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న ఇంద్రాణి
  • జైల్లో మరోసారి అస్వస్థత 
  • చికిత్స నిమిత్తం జేజే ఆసుపత్రికి తరలింపు
కుమార్తె షీనా బోరాను హత్య చేసిన కేసులో జ్యుడీషియల్ రిమాండులో వున్న ఇంద్రాణి ముఖర్జియా మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఛాతిలో నొప్పి రావడంతో జైలు అధికారులు ఆమెను ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు షీనా బోరా హత్య కేసులో కోర్టుకు హాజరైన ఇంద్రాణి వ్యక్తిగత కార్యదర్శి కాజల్ శర్మ గురువారంనాడు పలు సంచలన విషయాలను వెల్లడించారు. షీనా పేరుతో తన చేత ఇంద్రాణి ఓ మెయిల్ ఐడీని క్రియేట్ చేయించారని చెప్పారు. 2012 జూన్, జూలై నెలల్లో తాను ఈ పని చేసినట్టు కాజల్ శర్మ తెలిపారు. ఇంద్రాణి అరెస్ట్ అయ్యేంత వరకు షీనా బోరా ఆమె కుమార్తె అనే విషయం తనకు తెలియదని చెప్పారు. ఆమె సోదరిగానే తనకు తెలుసని వెల్లడించారు. ఇప్పటికే పలుమార్లు ఇంద్రాణి అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. 
indrani mukherjea
sheena bora
jj jospital

More Telugu News