Salman Khan: ఐపీఎల్ బెట్టింగ్ స్కాంలో సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్.. పోలీసుల సమన్లు

  • ఐపీఎల్‌లో అర్బాజ్ బెట్టింగ్
  • బయటపెట్టిన బుకీ
  • నేటి ఉదయం హాజరు కావాల్సిందిగా సమన్లు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌కు థానే పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బెట్టింగ్ స్కాం కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ సందర్భంగా జరిగిన బెట్టింగ్ కేసులపై థానే పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో అర్బాజ్ పేరు బయటకు రావడంతో విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు పంపారు. శనివారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.

మూడు రోజుల క్రితం సోనూ యజేంద్ర అనే బుకీని థానే క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు అర్బాజ్ పేరును బయటపెట్టాడు. దీంతో ఈ దందాలో అతడి పాత్రను నిర్ధారించుకునేందుకు సమన్లు జారీ చేశారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. అర్బాజ్ బెట్టింగ్‌లకు పాల్పడినట్టు అనుమానిస్తున్నామని, అతడి బ్యాంకు లావాదేవీలను పరిశీలించాలనుకుంటున్నామని పేర్కొన్నారు.
Salman Khan
Arbaaz khan
IPL
Betting

More Telugu News