Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కొత్త సినిమా షూటింగులో కాజల్ 
  • మరో చిత్రానికి ఓకే చెప్పిన నితిన్
  • నార్త్ ఇండియాకి వెళుతున్న మహేశ్

*  'సాక్ష్యం' చిత్రం తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేస్తున్న చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగులో తాజాగా కథానాయిక కాజల్ కూడా జాయిన్ అయింది. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
*  ప్రస్తుతం 'శ్రీనివాస కల్యాణం' చిత్రాన్ని చేస్తున్న హీరో నితిన్ తన తదుపరి చిత్రాన్ని చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చేయడానికి అంగీకరించాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్టు సమాచారం.
*  మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందే చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ఈ నెల 9 నుంచి డెహ్రాడూన్ లో జరుగుతుంది. ఇందుకోసం యూనిట్ హైదరాబాదు నుంచి ఈ నెల 5న బయలుదేరి వెళుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది.

More Telugu News