Kerala: చట్ట ప్రకారం పెళ్లి వయసు రాకపోయినా కలసి జీవించవచ్చు.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు!

  • తన కూతురిని యువకుడు నిర్బంధించాడంటూ తండ్రి కేసు
  • పరస్పర అంగీకారంతోనే కలిసి జీవిస్తోందన్న కోర్టు
  • పెళ్లి చేసుకునే వయసు రాగానే చేసుకోవచ్చని సూచన
అమ్మాయి, అబ్బాయిలు మేజర్లు కాకపోయినప్పటికీ పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే హక్కు ఉందని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తూ ఈరోజు కేరళ హైకోర్టు ఓ కేసులో కీలక తీర్పునిచ్చింది. తన కూతురిని ఓ యువకుడు నిర్బంధించాడంటూ కేరళలోని అలప్పుళ ప్రాంతానికి చెందిన మహ్మద్ రియాద్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా.. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం సదరు యువతి.. ఆ యువకుడితో పరస్పర అంగీకారంతోనే కలిసి జీవిస్తోందని తెలుసుకుంది.

దీంతో చట్ట ప్రకారం, పెళ్లి చేసుకునే వయసు వారికి లేకపోయినప్పటికీ కలిసి ఉండొచ్చని తీర్పునిచ్చింది. చట్టప్రకారం పెళ్లి చేసుకునే వయసు రాగానే వారు చేసుకోవచ్చని పేర్కొంది. 
Kerala
High Court
young
couple

More Telugu News