ramayan: రామాయణ కాలంలోనే టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ: ఉదాహరణ కూడా చెప్పిన యూపీ ఉప ముఖ్యమంత్రి

  • సీతమ్మ మట్టికుండలో జన్మించారు
  • టెస్ట్‌ ట్యూబ్‌ బేబీల కాలం అప్పటి నుంచే ప్రారంభమైంది
  • బీజేపీ నేత దినేశ్‌ శర్మ మరోసారి విచిత్ర వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దినేశ్‌ శర్మ విచిత్ర వ్యాఖ్యలు చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జర్నలిజం, ప్రత్యక్ష ప్రసారాలు మహాభారత కాలంలోనే ప్రారంభమయ్యాయని ఆయన నిన్న పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సంజయుడు హస్తినాపురంలోనే ఉండి కురుక్షేత్రంలో జరుగుతున్న యుద్ధం గురించి ఎప్పటికప్పుడు దృతరాష్ట్రుడికి వివరించాడని, ఇది లైవ్ టెలికాస్టేనని, నారద ముని ఆ కాలంలోనే సమాచారాన్ని చేరవేయడంలో సిద్ధహస్తుడని ఆయన నిన్న అన్నారు.

తాజాగా మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేశారు. ఈ సారి రామయణ కాలాన్ని గుర్తు చేశారు. టెస్ట్‌ ట్యూబ్‌ బేబీలు ఆ కాలంలోనే ప్రారంభమయ్యాయని అన్నారు. సీతమ్మ మట్టికుండలో జన్మించారని పెద్దలు అంటుంటారని, అందుకే టెస్ట్‌ ట్యూబ్‌ బేబీల కాలం అప్పటి నుంచే ప్రారంభమైనట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.

More Telugu News