sanjana reddy: 'ఖుషీ' సినిమా 27 సార్లు చూశాను: 'రాజుగాడు' దర్శకురాలు

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో అతికొద్ది మంది మహిళా దర్శకులు మాత్రమే తమ అభిరుచికి తగిన సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. అలాంటివారి జాబితాలో తాజాగా సంజనా రెడ్డి కూడా చేరిపోయారు. రాజ్ తరుణ్ హీరోగా ఆమె రూపొందించిన 'రాజుగాడు' ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె తనకి సినిమాల పట్ల ఆసక్తి ఏర్పడటానికి గల కారణాన్ని వివరించారు. "ఒకసారి వేసవి సెలవుల్లో విశాఖలోని మా బంధువుల ఇంటికి వెళ్లాను. ఆ సమయంలోనే పవన్ కల్యాణ్ 'ఖుషీ' విడుదలైంది. నెల రోజుల పాటు విశాఖలో వున్న నేను ఆ సినిమాను 27 సార్లు చూశాను. 'ఖుషీ' సినిమాలోని ప్రతీ సీన్ .. పవన్ కల్యాణ్ నటన నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. సినిమాలంటే అమితమైన ఆసక్తికి ఈ సినిమానే పునాది వేసింది. ఆ తరువాత నేను జర్నలిస్ట్ ను కావడంతో సినిమా ప్రపంచంతో మంచి పరిచయం ఏర్పడింది. వర్మ 'రౌడీ' సినిమాకి అసిస్టెంట్ గా పనిచేయడం .. అమల అక్కినేనితో చేసిన యాడ్ ఫిల్మ్ కి మంచి పేరు రావడంతో దర్శకత్వం వైపు అడుగులువేశాను" అని చెప్పుకొచ్చారు.  
Go Back to Shorts
sanjana reddy

More Telugu News