Hyderabad: సికింద్రాబాద్, ప్యాట్నీ సెంటర్ వద్ద ఘోరం... ఐదు కార్లను ఢీకొన్న లారీ!

  • బీభత్సం సృష్టించిన లారీ
  • అదుపుతప్పి వాహనాలపైకి
  • పలువురికి గాయాలు
సికింద్రాబాద్ లోని ప్యాట్నీ సెంటర్ వద్ద అర్ధరాత్రి ఓ లారీ బీభత్సం సృష్టించింది. పగలు, రాత్రి తేడాలేకుండా రద్దీగా ఉండే ఈ ప్రాంతానికి మితిమీరిన వేగంతో వచ్చిన ఓ లారీ, అదుపుతప్పి ఐదు కార్లను, పలు ద్విచక్ర వాహనాలను ఢీకొంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేశామని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతుందని పోలీసు అధికారులు వెల్లడించారు.
Hyderabad
Secunderabad
Road Accident
Lorry
Police

More Telugu News