patanjali: గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాయమైన పతంజలి మెసేజింగ్ యాప్

  • కింభో సోషల్ మెసేజింగ్ యాప్ ను లాంచ్ చేసిన పతంజలి 
  • ఐఓఎస్ స్టోర్ లో మాత్రం అందుబాటులో యాప్
  • వాట్సాప్ ను ఢీకొనడమే లక్ష్యం

కింభో పేరుతో సోషల్ మెసేజింగ్ యాప్ ను ప్రముఖ యోగా గురు బాబారాందేవ్ లాంచ్ చేసిన మరునాడే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అది మాయమైంది. దీంతో, యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటున్న వారు తికమకపడుతున్నారు. కింభో పేరుతో రెండు మూడు యాప్ లు కనపడుతున్నా అవి పతంజలి కమ్యూనికేషన్స్ కు సంబంధించినవి కాదు. ఇతరులు ఎవరో కింభో పేరుపై వాటిని ప్లే స్టోర్ లో ఉంచారు. అయితే ఇప్పటికే యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నవారికి మాత్రం యాప్ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఐఓఎస్ యాప్ స్టోర్ లో మాత్రం ఈ యాప్ ఇప్పటికీ అందుబాటులో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాప్యులర్ అయిన వాట్సాప్ ను ఢీకొంటామంటూ కింభో యాప్ ను రాందేవ్ బాబా తీసుకొచ్చారు. మరోవైపు, ఈ యాప్ కు సంబంధించి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తోంది. బహుశా వాటన్నింటినీ సరిచేసి, యాప్ ను మళ్లీ గూగుల్ ప్లే స్టోర్ లో ఉంచే అవకాశం ఉంది. దీనిపై పతంజలి నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

More Telugu News