nitish kumar: బీహార్ లో నితీష్ కుమార్ కు షాక్ ఇచ్చిన లాలూ ప్రసాద్ పార్టీ

  • జోకిహట్ ఉపఎన్నికలో ఆర్జేడీ గెలుపు
  • భారీ తేడాతో ఓడిపోయిన జేడీయూ
  • నితీష్ పై పైచేయి సాధించిన లాలూ

బీహార్ జోకిహట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ షాక్ ఇచ్చింది. జేడీయూ అభ్యర్థిని ఆర్జేడీ అభ్యర్థి చిత్తుగా ఓడించారు. ఆర్జేడీ అభ్యర్థికి కేవలం 37,913 ఓట్లు రాగా, ఆర్జేడీ అభ్యర్థికి 76,002 ఓట్లు పడ్డాయి. నితీష్, లాలూల మధ్య విభేదాలు పొడసూపిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఆర్జేడీ వైదొలగింది. బీజేపీ అండతో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉపఎన్నిక ఇరు పార్టీల మధ్య బలప్రదర్శనకు వేదికగా మారింది.

జోకిహట్ స్థానం నుంచి 2015లో జేడీయూ తరపున సర్ఫరాజ్ ఆలం గెలుపొందారు. ఈ ఏడాది మార్చిలో ఆయన ఆర్జేడీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన తండ్రి మహ్మద్ తస్లిముద్దీన్ మరణంతో ఖాళీ అయిన ఆరారియా లోక్ సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఎంపీగా సర్ఫరాజ్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో జోకిహట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో సర్ఫరాజ్ సోదరుడు షానవాజ్ ఆలం ఆర్జేడీ తరపున బరిలోకి దిగి, ఘన విజయం సాధించాడు. ఈ ఓటమితో జేడీయూ శిబరం చిన్నబోయింది. 

More Telugu News