Karnataka: ఓటమిని అంగీకరిస్తూ వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి... సంబరాల్లో మునిగిన కాంగ్రెస్!

  • ఆర్ఆర్ నగర్ లో ఖరారైన కాంగ్రెస్ గెలుపు
  • 30 వేలను దాటిన కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న మెజారిటీ
  • ప్రజల తీర్పును గౌరవిస్తానన్న మునిరాజ గౌడ

కర్ణాటకలోని ఆర్ఆర్ నగర్‌ (రాజరాజేశ్వరీ నగర్) అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న విజయం ఖరారు కావడంతో, సమీప అభ్యర్థి బీజేపీకి చెందిన మునిరాజ గౌడ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. తన ఓటమిని అంగీకరిస్తున్నానని, ప్రజల తీర్పును గౌరవిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. మునిరత్న ఆధిక్యం 30 వేలను దాటిపోగా, కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. కర్ణాటకలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంలో విఫలమై, జేడీఎస్ తో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి దక్కిన ఊరట విజయంగా ఆర్ఆర్ నగర్ ఎన్నికను భావించవచ్చు.

  • Loading...

More Telugu News