By-polls: కాస్తంత ఊరట... రెండు చోట్ల బీజేపీ ఆధిక్యం!

  • కొనసాగుతున్న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • మహారాష్ట్రలోని పాలుస్ కడేగావ్ లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి
  • ప్రకటించిన ఎలక్షన్ కమిషన్
  • మహారాష్ట్ర ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

4 లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కౌంటింగ్ శరవేగంగా సాగుతోంది. మహారాష్ట్రలోని పాలుస్ కడేగావ్ కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విశ్వజిత్ పతంగరావు విజయం సాధించినట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇక్కడ పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి చివరి క్షణంలో వైదొలగడం, ఆయన మినహా మరొకరు నామినేషన్ వేయకపోవడంతో పతంగరావు ఎన్నిక ఏకగ్రీవమైంది. మేఘాలయలోని అంపటి అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మియానీ డీ షిరా ఆధిక్యంలో ఉన్నారు.

ఉత్తరాఖండ్ లోని థారాలికీ జరిగిన బై పోల్స్ లో బీజేపీ అభ్యర్థి మున్నీ దేవీ షా, కర్ణాటకలోని ఆర్ఆర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న, జార్ఖండ్ లోని గోమియాలో జేఎంఎంకు చెందిన బబితా దేవి, సిల్లీలో ఏజేఎస్యూకు చెందిన సుదేష్ కుమార్ మహతో, పంజాబ్ లోని సహాకోట్ లో కాంగ్రెస్ అభ్యర్థి హర్దేవ్ సింగ్ లడీ ఆధిక్యంలో సాగుతున్నారు. మహారాష్ట్రలోని భందారా-గోండియా లోక్ సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి హేమంత్ పాట్లే, పాల్ ఘర్ లో ఆ పార్టీకే చెందిన గవిత్ రాజేంద్ర దేడ్యా ఆధిక్యంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News