priyanka chopra: నిక్ జోనాస్ తో పీకల్లోతు ప్రేమలో ప్రియాంకా చోప్రా?

  • పాప్ సింగర్ తో ప్రియాంక ప్రేమాయణం
  • వారం రోజుల్లో పలు చోట్ల షికార్లు
  • డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు
క్వాంటికో, బేవాచ్ లతో హాలీవుడ్ లో సైతం సత్తా చాటి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పీకల్లోతు ప్రేమలో పడిపోయిందనే వార్తలు షికారు చేస్తున్నాయి. పాప్ సింగర్ నిక్ జోనాస్ తో ఆమె డేటింగ్ చేస్తోందని చెబుతున్నారు. అమెరికా లాస్ ఏంజెలెస్ లో 'బ్యూటీ అండ్ ది బీస్ట్' లైవ్ కాన్సర్ట్ తో వీరిద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల వ్యవధిలో ఈ జంట పలు ప్రాంతాల్లో కలిసి తిరిగారు. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, అందుకే పర్యాటక ప్రాంతాల్లో విరామ సమయాన్ని గడుపుతున్నారని చెబుతున్నారు. దీనిపై, ప్రియాంక చోప్రా స్పందించాల్సి ఉంది.
priyanka chopra
nick jonas
love
pop singer
bollywood
quantico
baywatch

More Telugu News