FIFA World Cup: ఆటలో ఏకాగ్రత పొందడానికి బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం సలహా!

  • తమ జట్టు ఆటగాడికి రొమారియో సలహా
  • తాను అలాగే చేశానని వ్యాఖ్య
  • వచ్చే నెల 14న ఫిఫా వరల్డ్ కప్
ఆటలో ఏకాగ్రత చెక్కు చెదరకుండా ఉండాలంటే శృంగారంలో పాల్గొనడమే ఉత్తమ మార్గమని అంటున్నాడు బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు రొమారియో. ప్రపంచకప్ సమయంలో శృంగారానికి అస్సలు దూరం కావద్దని సలహా ఇస్తున్నాడు. బ్రెజిల్ జట్టులో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా మారిన 21 ఏళ్ల గాబ్రియల్ జీసస్‌కు రొమారియో ఇచ్చిన సలహా ఇది. మ్యాచ్‌ల మధ్యలో విరామం దొరికిన ప్రతిసారీ శృంగారంలో పాల్గొనాలని పేర్కొన్నాడు. 1994 ప్రపంచకప్‌లో తాను ఐదు గోల్స్ కొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు గెలుచుకోవడానికి అదే కారణమని గుర్తు చేసుకున్నాడు. జీసస్ తన సలహాను పాటించి గోల్స్ సాధించాలని సూచించాడు.

ఆటగాళ్లకు చాలినంత శృంగారం అవసరమనేది తన భావన అని, అయితే, మ్యాచ్‌ల సమయంలో మాత్రం దృష్టంతా ఆటమీదే ఉండాలని రొమారియో పేర్కొన్నాడు. జూన్ 14 నుంచి నెల రోజులపాటు రష్యాలో ఫిఫా వరల్డ్ కప్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 32 దేశాల జట్లు పాల్గొనన్నాయి.
FIFA World Cup
Football
Romariao
Russia

More Telugu News