CBI: ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. త్వరలో బీజేపీలో చేరిక?

  • రాష్ట్ర పర్యటనలో బిజీగా ఉన్న లక్ష్మీనారాయణ
  • ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జేడీ
  • త్వరలో బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు

ఇటీవల తన పదవికి రాజీనామా చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీలో చేరనున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనేనా? ఏపీలో ఇప్పుడీ చర్చ జోరుగా సాగుతోంది. లక్ష్మీనారాయణ 'సంఘ్' వ్యక్తి అంటూ ప్రచారం కావడం, ఇటీవల ఆరెస్సెస్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం ఇందుకు మరింత ఊతమిస్తోంది. ఆయన రాజకీయ అరంగేట్రంపై ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన విడుదల కాకపోయినప్పటికీ రాజకీయాల్లో అడుగుపెట్టడం ఖాయమని తెలుస్తోంది. అయితే, ఏ పార్టీ అనేది తేలకపోయినా, ఇప్పటి వరకు జరిగిన, జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే బీజేపీకే ఆయన ఓటేస్తారని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

'ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణా? లేక, జేడీ లక్ష్మీనారాయణా?' అంటూ ఇటీవల విలేకరులు అడిగిన ప్రశ్నకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెబుతూ.. ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎవరిని నిర్ణయిస్తే వాళ్లే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమ వెంటే ఉంటారని, అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News