Rajinikanth: రజనీకాంత్ సినిమాపై నిషేధం విధించడం దారుణం: హీరో విశాల్

  • కర్ణాటకలో 'కాలా'ను నిషేధించడం అనైతికం
  • భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమే
  • కర్ణాటక ఫిలిం ఛాంబర్ పునరాలోచించాలి

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కాలా'ను కర్ణాటకలో విడుదల కాకుండా అక్కడి ఫిలిం ఛాంబర్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కావేరీ జలాలపై రజనీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై సినీ హీరో, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ స్పందించాడు.

'కాలా' సినిమాను కర్ణాటకలో బ్యాన్ చేయడం అనైతికమని అన్నాడు. సినిమాను నిషేధించడమనేది భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనని చెప్పాడు. ఈ విషయంపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ పునరాలోచించాలని కోరాడు. సామాజిక అంశాలకు, సినిమాలకు ముడిపెట్టడం మంచిది కాదని తెలిపాడు.

More Telugu News