టీడీపీ నేతలు మాట్లాడినప్పుడు.. అమిత్ షా సమాధానం చెబితే తప్పేంటి?: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
- ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. పక్క రాష్ట్రాలు కూడా అడుగుతాయి
- రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోయింది
- ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది
రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోయిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కేంద్ర ప్రభుత్వం కారణం కాదని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని చెప్పారు. యూసీల గురించి టీడీపీ నేతలు మాట్లాడుతున్నప్పుడు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమాధానం చెబితే తప్పేంటని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, అన్నివిధాలా సహాయసహకారాలను అందిస్తుందని చెప్పారు.