Andhra Pradesh: టీడీపీ నేతలు మాట్లాడినప్పుడు.. అమిత్ షా సమాధానం చెబితే తప్పేంటి?: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

  • ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. పక్క రాష్ట్రాలు కూడా అడుగుతాయి
  • రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోయింది
  • ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది

ఏపీకి సాయం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏనాడూ వెనకడుగు వేయలేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఏపీపై ప్రధాని మోదీకి ఎలాంటి వివక్ష లేదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే, పక్క రాష్ట్రాలు కూడా అడుగుతాయని... అందుకే దానికి సమానంగా ప్రయోజనాలు దక్కేలా మోదీ చర్యలు తీసుకున్నారని తెలిపారు. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ, ఎవరికీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోయిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కేంద్ర ప్రభుత్వం కారణం కాదని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని చెప్పారు. యూసీల గురించి టీడీపీ నేతలు మాట్లాడుతున్నప్పుడు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమాధానం చెబితే తప్పేంటని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, అన్నివిధాలా సహాయసహకారాలను అందిస్తుందని చెప్పారు.

More Telugu News