charan: రికార్డు స్థాయిలో దూసుకుపోతోన్న రంగమ్మ .. మంగమ్మ పాట!

  • ఘన విజయం సాధించిన 'రంగస్థలం'
  • 'రంగమ్మ .. మంగమ్మ' పాటకు విశేష ఆదరణ 
  • తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్

సుకుమార్ దర్శకత్వంలో చరణ్ .. సమంత జంటగా తెరకెక్కిన 'రంగస్థలం' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కథా కథనాలు .. పాత్రలను మలిచిన తీరు .. సంగీత సాహిత్యాలు ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి. ఈ సినిమాలో చరణ్ .. సమంతలపై చిత్రీకరించిన 'రంగమ్మ .. మంగమ్మ' పాట విశేషమైన ఆదరణ పొందింది. ముఖ్యంగా యూత్ హృదయాలను పొలోమంటూ కొల్లగొట్టేసింది.

ఈ పాటను యూట్యూబ్ లో ఉంచిన నెల రోజులకే రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. నెల రోజుల్లోనే ఈ పాటకు 40 మిలియన్లకి పైగా వ్యూస్ రావడం విశేషం. 'బాహుబలి 2'లోని 'సాహోరే' పాటకు .. 'ఫిదా' లోని 'వచ్చిండే .. ' సాంగ్ కి ఇంతవరకూ 120 మిలియన్లకి పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ సాంగ్స్ ను యూట్యూబ్ లో ఉంచి చాలాకాలమే అయింది. తక్కువ సమయంలోనే ఆ స్థాయి వ్యూస్ ను 'రంగమ్మ ..  మంగమ్మ' రాబట్టవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.    

  • Loading...

More Telugu News