vijay mallya: మరో బయోపిక్: వెండితెరకు విజయ్‌ మాల్యా కథ

  • బాలీవుడ్ లో తెరకెక్కుతున్న విజయ్ మాల్యా బయోపిక్
  • మాల్యా పాత్రను పోషిస్తున్న గోవింద
  • గోవింద గెటప్ చూసి సర్ ప్రైజ్ అవుతారన్న పహ్లాజ్ నిహ్లానీ

భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తోంది. జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలకు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా, లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా జీవిత చరిత్రను సెన్సార్ బోర్డు మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో విజయ్ మాల్యా పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద పోషిస్తున్నాడని నిహ్లానీ తెలిపారు. మాల్యా పాత్రలో గోవింద గెటప్ చూసి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అవుతారని చెప్పారు. కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై ఓ పాటను గత వారమే షూట్ చేశారు. ఈ సందర్భంగా నిహ్లానీ మాట్లాడుతూ, గతంలో కంటే గోవింద ఇప్పుడు ఫిట్ గా ఉన్నారని కితాబిచ్చారు. బ్యాంక్ స్కాం సన్నివేశాలను వినోదాత్మకంగా తెరకెక్కించామని చెప్పారు. 

More Telugu News