jayaprakash reddy: మా తాత ఇచ్చింది 20 ఎకరాలు .. మా నాన్న 18 ఎకరాలు అమ్మేశాడు!: నటుడు జయప్రకాశ్ రెడ్డి

  • మా నాన్న చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ 
  • ఉన్న ఆస్తులన్నీ అమ్మేశారు 
  • అయినా మేము బాధపడింది లేదు
తెలుగు తెరపై విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ జయప్రకాశ్ రెడ్డి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. అద్భుతమైన డైలాగ్ డెలివరీతో అశేష ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.

"మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్ గా అనేక ప్రాంతాల్లో పనిచేశారు. ఆయన సర్వీస్ అయిపోయేటప్పటికి .. మా తాతగారు వ్యవసాయం చేసే 20 ఎకరాల్లో మా నాన్న 18 ఎకరాలు అమ్మేశారు .. ఇక మిగిలింది 2 ఎకరాలు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయన ఎవరింట్లోను టీ కూడా తాగేవారు కాదు .. లంచం తీసుకునేవారు కాదు.

 ఆయన చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ .. అందుకు మేమంతా ఎంతో సంతోషిస్తూ ఉంటాం. మా నాన్న సంపాదించకపోగా ఉన్నదంతా అమ్మేశాడే అని మేము ఏ రోజున అనుకోలేదు. మా నాన్నగారి నీతి .. నిజాయతి మమ్మల్ని ఈ రోజున ఈ స్థాయిలో ఉంచాయని మేమంతా నమ్ముతుంటాం" అని చెప్పుకొచ్చారు.      
jayaprakash reddy

More Telugu News