Rajanikant: 'కాలా' ప్రమోషన్ ను పక్కనబెట్టి.. తూత్తుకుడికి బయలుదేరిన రజనీకాంత్!

  • తూత్తుకుడి వెళుతున్నా
  • బాధితులను పరామర్శిస్తా
  • స్వయంగా వెల్లడించిన రజనీకాంత్
తమిళనాడులోని తూత్తుకుడిలో జరుగుతున్న పరిణామాలు సూపర్ స్టార్ రజనీకాంత్ లోని రాజకీయ నాయకుడిని బయటకు రప్పించాయి. ప్రస్తుతం తన తాజా చిత్రం 'కాలా' ప్రమోషన్ పనిలో ఉన్న ఆయన, ఆ పనిని పక్కనబెట్టాడు. స్టెరిలైట్‌ ఇండస్ట్రీస్ కాపర్ ప్లాంటుకు వ్యతిరేకంగా స్థానికుల నిరసనలు, పోలీసుల కాల్పులు, తదనంతర ఘర్షణల్లో 13 మంది మరణించిన నేపథ్యంలో బాధితుల కుటుంబాలను పరామర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారు.

ఈ ఉదయం స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన, తాను తూత్తుకుడి వెళ్తున్నానని, అమాయకుల రక్తాన్ని చిందించే పోరాటాలు భవిష్యత్‌ లో కళ్లజూడరాదన్నది తన అభిమతమని చెప్పారు. బాధితులకు తాను అండగా ఉంటానని చెప్పిన రజనీ, 'కాలా' ప్రమోషన్ నిమిత్తం ముందుగా అనుకున్న హైదరాబాద్, ముంబై టూర్ ను రద్దు చేసుకున్నారు. ఇదిలావుండగా, కొందరు బాధితులు రజనీ పర్యటనను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.
Rajanikant
Toothukkudi
Tamilnadu
Sterilite

More Telugu News