krish: ఒకేసారి రంగంలోకి అటు '2.ఓ' .. ఇటు 'మణికర్ణిక'!

  • శంకర్ దర్శకత్వంలో '2.ఓ'
  • క్రిష్ దర్శకత్వంలో 'మణికర్ణిక'
  • విడుదల తేదీల్లో రావలసిన క్లారిటీ  

శంకర్ .. రజనీకాంత్ కాంబినేషన్లో రూపొందిన '2.ఓ' థియేటర్లకు వచ్చే సమయం కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతవరకూ శంకర్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రగా ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్రను 'మణికర్ణిక' పేరుతో క్రిష్ రూపొందించాడు. చారిత్రక నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు.

 అదే సమయంలో '2.ఓ'ను విడుదల చేయనున్నారనే ప్రచారం జరిగింది. దాంతో క్రిష్ తన సినిమా విడుదలను సెప్టెంబర్ కి వాయిదా వేసుకుని .. ఆ దిశగా పనులు పూర్తి చేస్తూ వస్తున్నాడు. తీరా చూస్తే సెప్టెంబర్ లోనే '2.ఓ' సినిమాను విడుదల చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాంతో '2.ఓ' దర్శక నిర్మాతల నుంచి రానున్న అధికారిక ప్రకటన కోసం క్రిష్ వెయిట్ చేస్తున్నాడట. 

More Telugu News