PUC: వాహనాల బీమాపై ఐఆర్డీయే కొత్త నిబంధన!

  • బీమా కావాలంటే పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరి
  • రవాణా శాఖ నుంచి ఐఆర్డీయేకు సూచనలు
  • పీయూసీపై బీమా కంపెనీలకు ఆదేశాలు

ఎటువంటి వాహనానికైనా ఇన్స్యూరెన్స్ ఇవ్వాలంటే, పీయూసీ (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్ ను తప్పనిసరి చేస్తూ ఐఆర్డీయే (ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రవాణా శాఖ నుంచి ఐఆర్డీయేకు ఆదేశాలు రాగా, బీమా రెన్యువల్ సేవలందిస్తున్న అన్ని కంపెనీలకూ నోటీసులు వెళ్లాయి.

ఇండియాలో దాదాపు 25 వరకూ బీమా కంపెనీలు ఉండగా, సుప్రీంకోర్టు 2017, ఆగస్టు 10న ఇచ్చిన ఆదేశాల మేరకు, చెల్లుబాటులో ఉన్న పీయూసీ సర్టిఫికెట్ ఉంటేనే బీమా చేయాల్సివుంటుంది. ఇక ట్రాన్స్ పోర్ట్ వాహనాలకైతే ఫిట్ నెస్ సర్టిఫికెట్ ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు పంపింది. ఇదిలావుండగా, ఏప్రిల్ 2019లోగా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వాహనాల కాలుష్య వివరాలను ఆన్ లైన్లో ఉంచేలా చూడాలని కూడా రవాణా శాఖ నుంచి ఐఆర్డీయేకు సూచనలు వెళ్లాయి.

More Telugu News