stock market: నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

  • 216 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌
  • 34,949 వద్ద ముగింపు
  • 55 పాయింట్ల నష్టంతో 10,633 వద్ద ముగిసిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 216 పాయింట్లు కోల్పోయి 34,949 వద్ద ముగియగా, నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 10,633 వద్ద ముగిసింది. కొన్ని రోజులుగా వరుసగా లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు మాత్రం మదుపర్ల లాభాల స్వీకరణతో నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు. అలాగే, నేడు అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు రూపాయి విలువ పతనమయిందని అన్నారు.  

టాప్ గెయినర్స్
: గెయిల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎయిర్‌టెల్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్.
లూజర్స్: ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ బ్యాంక్.
stock market
India
business

More Telugu News